Header Banner

మార్క్ శంకర్ ఆరోగ్యంపై చిరంజీవి స్పందన.. అగ్నిప్రమాదం నుంచి కాపాడిన అంజనేయుడు! మెగా కుటుంబం కృతజ్ఞతల వెల్లువ!

  Thu Apr 10, 2025 20:30        Others

సింగపూర్‌ స్కూల్‌లోని తరగతి గదిలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. గురువారం సింగపూర్‌లో చిరంజీవి మాట్లాడుతూ.. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడన్నారు. అయితే బాబు ఇంకా కోలుకావాల్సి ఉందని పేర్కొన్నారు. మా కులదైవం అంజనేయస్వామి దయతో.. కృపతో త్వరలోనే కోలుకొని పూర్తి ఆరోగ్యవంతుడు అవుతాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ మాములుగా ఎప్పటిలాగే బాబు ఉంటాడన్నారు. శుక్రవారం..అంటే ఏప్రిల్ 11వ తేదీ హనుమన్ జయంతి అని ఈ సందర్భంగా చిరంజీవి గుర్తు చేశారు. ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడని అన్నారు. మార్క్ శంకర్ కోలుకోవాలని.. వివిధ ప్రాంతాల్లోని పలు ఊళ్లలో.. ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారని.. ఆశీస్సులు అందజేస్తున్నారని చెప్పారు.


ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!


ఇలా తమ కుటుంబానికి అండగా నిలబడి.. వారందరికి నా తరఫున, తమ్ముడు పవన్ కల్యాణ్ తరఫున, మా కుటుంబం యావన్మంది తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నామని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారికంగా పర్యటించారు. ఆ సమయంలో సింగపూర్‌లో ఆయన కుమారుడు మార్క్ శంకర్ చదువుతోన్న స్కూల్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుందంటూ సమాచారం అందింది. ఈ ప్రమాదంలో అతడికి కి కాళ్లు, చేతులకు గాయాలైనట్లు పవన్ కళ్యాణ్‌కు సమాచారం అందింది.దీంతో ఆయన సింగపూర్ వెళ్లాలని నిర్ణయించారు. ఆ క్రమంలో పెద్ద సోదరుడు చిరంజీవి దంపతులుతోపాటు పవన్ కల్యాణ్ సింగపూర్ బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Chiranjeevi #PawanKalyan #MarkShankar #HanumanBlessings #MegaFamily #FireAccident